ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కొడుకు.. తండ్రి ఏం చేశాడంటే..
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన కొడుకు మరణించడంతో తట్టుకోలేని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అక్కడ మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రావు(49) కుమారుడు నిఖిల్(21) లక్షల్లో అప్పులు చేశాడు. దీనితో అవి తీర్చలేక, ఒత్తిడికి లోనై రెండు నెలల క్రితం వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకైక కుమారుడు నిఖిల్ చనిపోవడంతో తట్టుకోలేని తండ్రి తిరుపతి రావు తీవ్ర బాధకు లోనయ్యాడు. దీనితో అదే బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. నిన్ను మరిచిపోలేకపోతున్నాను బిడ్డా అంటూ విలపించేవాడని కుటుంబంలోని వారు చెప్తున్నారు. దీనితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.