ఫేమస్ కోసం ప్రాణాలతో చెలగాటం..
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అన్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్. ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? అని ఇన్ ఫ్లూజర్స్ ను ప్రశ్నించారు. ‘ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి.’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

