Home Page SliderTelangana

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి

విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కొక్కిలిగడ్డ సూర్యనారాయణ మృతి చెందారు. కడుపునొప్పితో వచ్చిన తమకు సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నడచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి డెడ్ బాడీగా తిరిగి అప్పగిస్తున్నారని మృతుడి భార్య కంటతడి పెట్టింది. ఇలాంటి డాక్టర్లు సమాజంలో ఉండకూడదని.. వెంటనే డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది.