భారత్‌లో తొలి ‘టెస్లా’ కార్ ఓనర్ ఈయనే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా కార్లు భారత్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా భారత్‌లో అమ్మకాలు మొదలు కాలేదు. సూరత్‌లో టెస్లాకు చెందిన సైబర్ ట్రక్ రోడ్లపై సందడి చేస్తోంది. దీనిని సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త లవ్జీ దాలియా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిని అమెరికాలో కొనుగోలు చేసి, దుబాయ్ ద్వారా భారత్‌కు దిగుమతి చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని ధర భారత కరెన్సీలో రూ. 60 లక్షలుగా ఉంది. లవ్జీ దాలియా సూరత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, వజ్రాల వ్యాపారిగానూ, పవర్ లూమ్ యజమానిగానూ గుర్తింపు పొందారు. అలాగే గోపీన్ ఫౌండేషన్ స్థాపించి, దాతృత్వ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దీనితో ఆయనను స్థానికులు బాద్‌షా అని పిలుస్తారు. ప్రధాని మోదీతో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

