ఈ టీచర్ చేసిన పని చూస్తే..
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మూడు రమేష్ బాబు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఆశయంతో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మైక్‌తో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాల ఫోటోలు వివరాలతో ముద్రించిన కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు ములగలంపల్లి, రౌతుగూడెం, రవీంద్రనగర్, కనకపురం, పాకాలగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. దీనితో పలువురు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నట్లు సమాచారం.

