ముంబయి పేలుళ్ల నిందితుడు భారత్‌కు..
ముంబయి పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుండి ఎట్టకేలకు భారత్‌కు రప్పిస్తున్నారు. అతడికి అమెరికాలో ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. అతడిని భారత్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దీనితో అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగు ప్రయాణమయినట్లు తెలిసింది. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారి నాటికి వారు భారత్‌కు చేరుకుంటారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ 26-11 నాటి ముంబయి ఉగ్రదాడిలో పాల్గొన్న అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తామని, త్వరలోనే మరింత మంది నేరగాళ్లను కూడా అప్పగిస్తామని పేర్కొన్నారు. తహవూర్ రాణా పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ఈ ముంబయి పేలుళ్ల దాడుల్లో సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తహవూర్ రాణా తనను భారత్‌కు అప్పగించవద్దంటూ యూఎస్ కోర్టులలో పోరాడాడు. అయితే అతని అప్పీలును అక్కడి సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో అతనికి భారత్‌కు రాక తప్పలేదు.

