Home Page SliderNational

ఫ్లై ఓవర్ పై పశువులు.. కాన్వాయ్ ఆపిన సీఎం..

ఫ్లై ఓవర్ పై వెళుతున్న ఢిల్లీ సీఎం కాన్వాయ్ ఒకేసారి ఆగింది. అలా కాన్వాయ్ ఆగడంతో అక్కడ ఉన్న జనం ఒకింత షాక్ కు గురయ్యారు. అసలు కాన్వాయ్ ఎందుకు ఆగిందని ఆశ్చర్యపోయారు. హైదర్‌పూర్ ఫ్లై ఓవర్‌పై ఆశ్రయం లేకుండా నడిరోడ్డుపై పశువులు అటు ఇటు తిరుగుతున్నాయి. అది చూసిన సీఎం రేఖా గుప్తా తన కాన్వాయ్ ను ఆపి కారు నుంచి దిగి రోడ్లపై తిరుగుతున్న పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. అలా ఫ్లై ఓవర్ పై కాన్వాయ్ ఆపడంతో గంటల తరబడి ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. నడిరోడ్డుపై కాన్వాయ్ ని ఆపి ఇలా అధికారులకు ఆదేశాలివ్వడం ఏంటని వాహనాదారులు సీఎంపై విమర్శలు చేశారు.