ఆన్లైన్ బెట్టింగ్‌పై సీఎం కీలక నిర్ణయం..
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ యాప్‌లను ప్రమోట్ చేయడంతో వీటిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని భావించామని, అలాగే మాదక ద్రవ్యాల నివారణకు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలాంటి కేసులలో శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

