Home Page SliderTelangana

తీవ్ర విషాదం.. మృత్యు ఒడిలోకి ఇద్దరు మహిళలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన టేకుమట్ల మండలం రామకిష్టాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పత్తి గింజల లారీ అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కూలీ పనికి వెళ్లిన ఇద్దరు మహిళలు మృత్యు ఒడిలోకి చేరారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.