Home Page SliderNational

రోజుకు 5 వేలు ఇస్తే కాపురం చేస్తా..

ఇటీవలే కాలంలో చాలా మంది భర్తలు భార్యల వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ వరుస ఘటనలు చూస్తుంటే.. అసలు పెళ్ళంటే ఆందోళనగా ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఓ భార్య పెట్టే మానసిక క్షోభను భరించలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు ఓ సాఫ్ట్ వేర్ భర్త. బెంగళూరు పట్టణంలోని వయ్యాలి కావల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఓ యువతిని ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. సదరు యువతి ఇంట్లోనే ఉంటూ రోజుకు రూ.5 వేలు క్యాష్ ఇస్తేనే కాపురం చేస్తానంటూ అల్టిమేటం జారీ చేసింది. లేదంటే రూ. 45 లక్షలు భరణం చెల్లించి తన నుంచి విడాకులు తీసుకోవాలని టార్చర్ చేస్తోంది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న తాను ఆఫీస్ జూమ్ మీటింగ్ కు హాజరయ్యే క్రమంలో అసభ్యకరంగా డ్యాన్స్ లు చేస్తూ బూతులు తిడుతోందని… తిరిగి ఏదైనా అంటే చనిపోతానంటూ బెదిరింపులకు దిగుతోందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.