14 రోజుల్లో 900 సార్లు భూకంపం..భూకంప సునామీ… ?
భూకంపాలకు కేరాఫ్ గా టొకరా దీవులు
12 దీవుల్లో 7 లో 700 చొప్పున జనవాసం
ఒక్కరోజులోనే 183 సార్లుతో దడ దడ
ఏకంగా 900 సార్లు దద్దరిల్లిన భూకంపం
ఏడాదిలో 1500 సార్లు రాకతో రికార్డు
5.5 రిక్టర్ స్కేలు తీవ్రత నమోదు
క్షణక్షణం భయం…నిమిషం ఓ నరకం …ఇది అక్కడి ప్రజల గుండెల్లో డబ్ డబ్ మనే శబ్ధం. నిరంతరం అక్కడి జనం భయం గుప్పిట్లో వణుకుతూ బ్రతుకువెళ్లదిస్తున్నారు. గంటకు సగటున మూడుసార్లుకు పైగా భూమి కంపిస్తుంటే దిక్కు తోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. భయానక ప్రకృతి విలయంలో ఉంది జపాన్. ముఖ్యంగా టొకార దీవుల సమూహంలో భూకంపాలు అక్కడి వారిని బెంబేలెత్తిస్తున్నాయి. జూన్ 21వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ భూ ప్రకంపనలు ఇప్పటివరకు తగ్గకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత రెండు వారాల్లోనే ఏకంగా 900 సార్లు భూమి కంపించిందని జపాన్ భూకంప పరిశోధన శాఖ వెల్లడించింది. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఒక్కరోజే 183 సార్లు కంపించిన భూమి..
జూన్ 23న ఒక్కరోజే 183 సార్లు భూ ప్రకంపనలతో దద్ధరిల్లింది. ఇది ఓ రికార్డ్ గా నమోదవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ రోజు భూమి నిరంతరం కదిలిపోతున్నట్టు అనిపించిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఏ క్షణానేమి జరుగుతుందో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. అలానే 2025 జూన్ 26 న భూమి 5.5 తీవ్రతతో ఓ భారీ భూకంపం సంభవించింది. వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసి అనంతరం ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వారికి సహాయపడేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.టొకార దీవుల్లో మొత్తం 12 దీవులు ఉండగా వాటిలో కేవలం 7 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. జనాభా సుమారుగా 700 మందికే పరిమితమైనప్పటికీ.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంపాల తీవ్రత దృష్ట్యా ఎప్పుడైనా విపత్తు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.జపాన్ లో భూకంపాలు కొత్తేమి కాదు.వాస్తవానికి అక్కడి వారికి భూకంపం వస్తుందంటే లైట్ తీసుకుంటారంటే ఎంత తీవ్రతను అనుభవిస్తే అలావాటై పోయిందో అర్ధమవుతుంది. ప్రస్తుత తరుణంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ దేశం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’పై ఉండటంతో సంవత్సరానికి సగటున 1,500 భూకంపాలు నమోదు అవుతుంటాయని స్పష్టం చేస్తున్నారు. గతేడాది టొకార దీవుల్లో 346 సార్లు భూమి కంపించినట్టు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

