crimeHome Page SliderNews AlertTelangana

టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి న్యాయ పోరాటం

డిఎస్సీలో క్వాలిఫై అయ్యింది….ఆర్డ‌ర్ కాపీ తీసుకుంది…అది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామ‌క ప‌త్రాన్ని అందుకుంది.ఇంకేముంది స్కూల్ కి వెళ్లి పిల్ల‌ల‌కు పాఠాలు చెప్తూ త‌న క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నుకుంది.ఇంత‌లోనే పిడుగుపాటు వార్త తెలిసుకుని ఇప్ప‌టికీ త‌ల్ల‌డిల్లిపోతుందా త‌ల్లి.ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన తెలంగాణ‌ డీఎస్సీలో 1:1తో సెలెక్టయి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ కూడా తీసుకుంది.తీరా స్కూల్‌లో మాత్రం త‌న‌ని కాద‌ని 13వ ర్యాంకు వ‌చ్చిన వ్య‌క్తికి పోస్టింగ్ ఇచ్చి వెన్నుచూపింది తెలంగాణ స‌ర్కార్‌.ఇప్పుడు జ్యోత్స్న నిండు ఎనిమిది నెల‌ల‌ గ‌ర్భిణి.ఈ స్థితిలోనూ ఎంతో అవ‌స్థ‌ప‌డుతూ జిల్లా క‌లెక్ట‌రేట్ కి వ‌చ్చి విన‌తి ప‌త్రం అందించింది.త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతోంది.దీంతో ఆమె దుస్థితి చూసి ప‌లువురు అయ్యోపాపం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.