విషాహారం తిని ఆసుపత్రి పాలైన 60 మంది విద్యార్ధులు
తిరుపతి జిల్లాలోని సత్యవేడు బీసి గురుకుల పాఠశాల విద్యార్ధులు ఆసుపత్రి పాలయ్యారు.విషాహారం తినడంతో ఏకంగా 60 మంది విద్యార్ధులకు వైరల్ ఫీవర్స్ వచ్చాయి.దీంతో పాఠశాల సిబ్బంది…విద్యార్ధులను హుటాహుటిన ఆటోల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొంత మంది పరిస్థితి నిలకడగా ఉందని , 28 మందికి తీవ్ర అస్వస్థతగా ఉందని వైద్యులు వెల్లడించారు.అయితే కుళ్లిపోయిన ఆహార పదార్ధాలు తినడం వల్లే విష జ్వారాలు వచ్చాయని వైద్యులు నిర్ధారించారు.కాగా బాధిత విద్యార్ధులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్,డీఎం అండ్ హెచ్ వోశ్రీహరి తదితరులు పరామర్శించారు. విద్యార్ధుల పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.విషయం పై జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.