వామ్మో.. ఒకే రోజు 3, 500 కోళ్లు మృతి..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. గ్రామానికి చెందిన పాత్లోత్ ప్రసాద్ అనే వ్యక్తి పౌల్ట్రీఫామ్ లో ఒక్కసారిగా 3,500 నాటు కోళ్లు మృతి చెందాయి. దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. తన ఫామ్ పక్కనే గల బాయిలర్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ సోకడంతో కోళ్లు మృతి చెందాయని, తన ఫామ్ లో కూడా బర్డ్ ఫ్లూ సోకడంతోనే నాటుకోళ్లు మృతి చెందాయని ప్రసాద్ తెలిపాడు. సుమారు రూ. 8 లక్షల వరకు ఖర్చు చేశానని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదంటూ వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రసాద్ కోరాడు.