Home Page SliderInternational

దక్షిణ అమెరికాపై విరుచుకుపడ్డ 35 “టోర్నోడోలు”

దక్షిణ అమెరికాను “టోర్నోడోలు” చుట్టేశాయి. ఆ దేశంలోని పలు రాష్ట్రాలను “టోర్నోడోలు” అతలాకుతలం చేశాయి. ఈ టోర్నోడోలు ముఖ్యంగా అలబామా,జార్జియా ప్రాంతాలలో ఎక్కువగా ప్రభావం చూపించాయి. దీంతో అక్కడ ప్రాణనష్టం,ఆస్తినష్టం సంభవించాయి. టోర్నోడో ప్రభావంతో అక్కడ భీకర గాలులు వీచాయి. వీటి దాటికి అక్కడ ఇప్పటికే ఇళ్లు,చెట్లు నేలమట్టమయ్యాయి. కాగా ఇప్పటివరకు సంభవించిన పలు ప్రమాదాలలో 9 మంది మృతి చెందారని అక్కడి అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ క్షతగాత్రులను రక్షించేందుకు అధికారులు రెస్యూ ఆపరేషన్ చేపట్టారు. టోర్నోడో ప్రభావం వల్ల విద్యుత్ సరఫరా దెబ్బతిని చాలా చోట్ల చీకట్లు అలుముకున్నాయి. దక్షిణ అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఎంతో ప్రసిద్ది చెందిన సెల్మా నగరంపై టోర్నోడోలు విరుచుకుపడ్డాయి. వీటి దెబ్బకి అక్కడ ఓక్ వృక్షాలు,కార్లు బోల్తా కొట్టాయి. డజనుకు పైగా ఇళ్లు నేలకూలాయి. అయితే దక్షిణ అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో ఇప్పటివరకు 35 టోర్నోడోలు ఏర్పడినట్లు ఫెడరల్ ఏమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.