NationalNewsNews Alert

గణేష్ చతుర్థి ఉత్సవాలకు 316 కోట్లరూపాయల ఇన్సూరెన్స్

ఇన్సూరెన్స్ పాలసీలకు అది, ఇది అంటూ లేదు. అన్నింట్లోనూ ప్రవేశిస్తున్నాయి. తాజాగా గణేష్ చతుర్థి ఉత్సవాలకు కూడా పాలసీ తీసుకున్న సంఘటన మనదేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. నమ్మశక్యంగా లేదు కదా.. అది కూడా వందలు, వేలు కాదు, రికార్డుస్థాయిలో 316.4 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీని ముంబయ్‌లోని GSB సేవామెడల్ కింగ్స్ సర్కిల్ ఐదురోజుల పండుగ నిమిత్తం తీసుకుంది. ప్రభుత్వరంగసంస్థ అయిన ఎస్యూరెన్స్ బీమా సంస్థ నుండి ఈ పాలసీని కొనుగోలు చేసారు. ఎందుకంటే ఈ మండలంలో ఉంచిన గణపతిని సుమారు 66 కిలోల బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తారు. ఈ పాలసీ కింద 32 కోట్లు ఈ వస్తువులను కవర్ చేస్తే, మిగిలిన 263 కోట్ల రూపాయలు మండల వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, స్టాల్ కార్మికులు, వాలెట్ పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు కూడా కవరేజ్ లభిస్తుంది.

ఇంకా ఫర్నిచర్, ఫిక్చర్స్, ఫిట్టింగ్‌లు, CCTV , SCANNERS,కిరాణా, పండ్లు, కూరగాయలు, భూకంపం వంటి ప్రమాదాలు కూడా కవర్ చేసే స్పెషల్ పాలసీలు కూడా కోటి రూపాయల పాలసీని తీసుకున్నట్లు తెలియజేసారు ఈ ఉత్సవ నిర్వాహకులు. చూసారా ఎంత ఖరీదైన ఉత్సవం, భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారో.. ఆ లంబోదరునికి అన్నీ భారీగానే జరగబోతున్నాయన్నమాట.