Home Page SliderNationalNews Alert

మూడు రోజుల్లోనే 313 కోట్లు…

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా రికార్డు కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. విడుదల అయిన 3 రోజుల్లోనే 300 కోట్లు రాబట్టింది. ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 313 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.ఇండియాలో మూడో రోజు పఠాన్‌ 38 కోట్లు రాబట్టగా… మొత్తంగా 161 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి మరో 5.75 కోట్లు జమ అయినట్టు చెప్పారు. దీంతో హిందీలో వచ్చిన మూవీస్‌లో పఠాన్‌ ఫాస్టెస్ట్‌ కలెక్షన్లు వసూలు చేస్తోందని తెలిపారు.