ఈ జిల్లాలలో మరో 3 రోజులు సెలవులు
ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరద ముంపు భయంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుండి ఈ నెల 17 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అనంతపురంలో 16,17 తేదీలలో సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరులో నేడు, రేపు సెలవులు ప్రకటించారు. దక్షిణకోస్తా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో కూడా రేపటి వరకూ సెలవులు ప్రకటించారు.

