NationalNews Alert

దక్షిణఫ్రికా నుంచి ఇండియాకు 25 చిరుతలు

దక్షిణఫ్రికా, నమీబియా నుండి తెప్పిస్తున్న 8 చిరుత పులులు ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టనున్నారు. ఎనిమిది పులులులో ఐదు ఆడ, మూడు మగ పులులు ఉన్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.

వాటిని విండ్‌హోక్ నుండి జైపూర్‌కు తరలించి, అక్కడి నుంచి పాల్పూర్‌కు తరలిస్తారు. వాటి ల్యాండింగ్ కోసం రెండు హెలిప్యాడ్‌లను నిర్మించినట్లు ఆయన తెలిపారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ పార్కులో విడిచిపెడతారు. నమీబియా, దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల నుంచి వీటిని తెప్పిస్తున్నారు. ఈ ప్రక్రియ దశల వారిగా ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి దశలో సెప్టెంబర్ 17వ తేదిన 8 చిరుత పులులు కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌కి రానున్నాయి.