ఏపీకి తక్షణం 15 వేల కోట్లు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సహకారం
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద 15 వేల కోట్లిస్తామని చెప్పారు. అవసరాలకు అనుగుణంగా అమరావతికి మరిన్ని నిధులు అందిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. భారతదేశ ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమైందన్నారు. ఏపీ రైతులకు పోలవరం జీవనాడి అని చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తామన్నారు నిర్మలా సీతారామన్.

