Home Page SliderNationalNews Alert

కార్డియాక్‌ అరెస్ట్‌తో పన్నెండేళ్ల చిన్నారి మృతి

చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటుతో జనాలు ప్రాణాలు విడుస్తున్నారు. నిత్యం దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  ఓ చిన్నారికి పన్నెండేళ్లకే నూరేళ్లు నిండాయి. ఈ  విషాద ఘటన కర్ణాటక కుశాల్‌నగర్‌లోని కూడుమంగళూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్‌… శనివారం సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి… రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యలోనే ఆ చిన్నారి తుదిశ్వాస విడిచాడు. కీర్తన్‌ తండ్రి మంజాచారీ.. కొడుకు చదివే స్కూల్‌లోనే వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.