కెనడాలో దారుణం, కత్తులతో దాడి 10 మంది మృతి

కెనడాలోని సస్కట్చేవాన్ ప్రావిన్స్‌లోని కత్తిపోటు దాడి ఘటనలో కనీసం 10 మంది మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు, ఇద్దరు అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు వాహనంలో పారిపోయారు. 2,500 జనాభా కలిగిన జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‍లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొందరిని టార్గెట్ చేసి దాడి చేశారని పోలీసులు తెలిపారు. అయితే యాదృచ్ఛికంగా కొందరు దాడికి గురయ్యారన్నారు. మొత్తం 13 వేర్వేరు లొకేషన్‌లలో కత్తిపోట్లతో దుండగులు దాడి చేశారు. ఈ దాడులు అత్యంత భయంకరమైనవని, హృదయ విదారకమైనవని ట్వీట్ చేశారు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని… ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు.