Home Page SliderInternational

కెనడాలో వేల కిలోమీటర్ల కార్చిచ్చు -అమెరికాలో కూడా వ్యాపించిన దట్టమైన పొగ

కెనడాలోని దట్టమైన అడవులలో అత్యంత భయంకరమైన కార్చిచ్చు వ్యాపించింది. వేల కిలోమీటర్ల అడవి కాలి బూడిదయిపోతోంది. ఇది జూన్ 1 వతేదీన మొదలయ్యింది. దాదాపు 76,130 చదరపు కిలోమీటర్ల అడవి అగ్నికి ఆహుతయిపోయింది. దీనివల్ల ఏర్పడిన పొగ కారణంగా కెనడా మాత్రమే కాక అమెరికాలోని నగరాలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. అమెరికాలోని గ్రేట్ లేక్, ఇల్లినాయిస్, మిషిగాన్, షికాగో, డెట్రాయిట్, మిల్వాకీ నగరాలలో గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితి బుధవారం రాత్రి వరకూ కొనసాగొచ్చని హెచ్చరించారు మిషిగాన్ వాతావరణ శాఖ. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ఇళ్లలోనే ఉండాలని షికాగో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీనితో క్రీడా సెంటర్లు, డేకేర్ సెంటర్లు, స్కూళ్లు మూసివేశారు.