విజయం దిశగా టీఆర్ఎస్.. 11వ రౌండ్లోనూ లీడ్
టీఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల లీడ్ సాధించారు. ఆ రౌండ్లో కూసుకుంట్లకు 7,235 ఓట్లు, రాజగోపాల్ రెడ్డికి 5,877 ఓట్లు లభించాయి. 11 రౌండ్లు పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ 5,794 ఓట్ల ఆధిక్యతను కొనసాగిస్తోంది. అద్భుతాలు జరిగితే తప్ప టీఆర్ఎస్ విజయం ఖాయమనే చెప్పొచ్చు. దీంతో తెలంగాణ భవన్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. 11 రౌండ్ల తర్వాత టీఆర్ఎస్కు 74574 ఓట్లు.. బీజేపీకి 68800 ఓట్లు లభించాయి. కాంగ్రెస్కు 16280 ఓట్లు మాత్రమే పడ్డాయి.

