NewsTelangana

క్లౌడ్ బరస్ట్ కామెంట్స్‌ పై వైఎస్‌ షర్మిల కౌంటర్‌…

Share with

క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ వాఖ్యలు చేసిన నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వానలు, వరదలు రావడానికి క్లౌడ్ బస్టర్ అని కాకమ్మ కథ చెప్పి , బోడి గుండుకు మోకాళ్ళకు ముడేస్తున్నాడని షర్మిల ఎద్దేవా చేశారు. వారం రోజుల వానల తర్వాత వరద బాధితులకు చూసేందుకు ఇయ్యాల తీరింది దొరకు. హెలీకాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి, తెలంగాణపై విదేశీ కుట్ర జరుగుతోందని సెలవిచ్చిండని మండిపడ్డారు. విదేశీ కుట్రల మీద సమాచారం ఉన్న సారుకు… వరద నష్టం మీద ఎంత సమాచారం అందిందో అంటూ విమర్శించారు. లక్షల్లో ఆస్తి నష్టపోయి, గూడు లేని, తిండి అందని వరద బాధితులకు 10వేల సాయం ప్రకటించడమేంటని మండిపడ్డారు. సారు..ఈ సాయమన్న అందుతుందా ? GHMC లో వరద సాయమని మీ గులాబీ లీడర్లే మింగేసినట్టు మింగుతారా అంటూ ప్రశ్నించారు. వరంగల్లో ఇస్తామని మరిచినట్టు ఇది కూడా ఉత్త హామీనేనా అంటూ షర్మిల ఫైర్‌ అయ్యారు.