ఆత్మకూరులో వైసీపీ బంపర్ విక్టరీ.. లక్ష మెజార్టీ మిస్
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం ఓటర్లు 2,13,338 కాగా… ఎన్నికల్లో లక్షా 37 వేల 81 ఓట్లు పోలయ్యాయ్. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి లక్షా 2 వేల 74 ఓట్లు రాగా… బీజేపీకి 19 వేల 332 ఓట్ల లభించాయ్. కాగా నోటాకు 4,197 ఓట్లు నోటాకు రావడం విశేషం. ఇక బీఎస్పీ అభ్యర్థికి సైతం 4,897 ఓట్లు లభించాయ్. మొత్తంగా వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82, 742 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ, జనసేన పోటీ చేయకపోవడంతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అయ్యింది. అయితే ఈ ఎన్నికలోనూ బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఏపీలో జరిగిన మూడు ఉపఎన్నికలు… తిరుపతి, బద్వేలు, ఆత్మకూరులో కనీసం బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.