NationalNews

ఉపఎన్నికల్లో ఆప్‌కు చుక్కెదురు.. బీజేపీ జయభేరి

Share with

దేశ వ్యాప్తంగా జరిగిన మూడు లోక్ సభ, 5 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ ఉపఎన్నికలో అకాలీదల్ విజయం సాధించగా… యూపీలో జరిగిన రెండు లోక్ సభ స్థానాలు రాంపూర్, అజమ్‌ఘర్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మూడు చోట్ల విజయం సాధిస్తే… కాంగ్రెస్ రెండు చోట్ల, ఆప్, వైసీపీ ఒక్కో చోట విజయం సాధించాయ్. యూపీలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తిరగులేని విజయాన్ని సాధించింది.

రాంపూర్‌లో జరిగిన ఎన్నికలో బీజేపీ నేత అభ్యర్థి ఘనశ్యాం లోధి 40 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సమాజ్ వాదీ పార్టీ చేతిలో ఉన్న ఎంపీ స్థానంలో గెలిచి బీజేపీ చరిత్ర సృష్టించింది. అజమ్‎ఘర్ స్థానం నుంచి సైతం బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీ కంచుకోటలో బీజేపీ గెలవడం అసాధారణ పరిణామం. ఇక పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ ఖాళీ చేసిన షంగ్రూర్ స్థానాన్ని శిరోమణి అకాలీదల్ గెలుచుకొంది. 7 వేల ఓట్లతో అధికార పార్టీ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. ఇక షంగ్రూర్ లోక్ సభ స్థానంలో అత్యల్ప ఓటింగ్ నమోదయ్యింది.

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ షా సైతం 6 వేల ఓట్లతో విజయం సాధించారు. అగర్తలలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ నేత గెలుపొందారు. త్రిపురలో జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింటిలోనూ, కాంగ్రెస్ ఒక్కచోట గెలిచింది. త్రిపుర సీఎం మాణిక్ షా టౌన్ బర్డోవాలి నుంచి, మలినా దేబ్‌నాథ్ జబుర్జానగర్ నుంచి, స్వప్నాదాస్ పాల్.. సుర్ణా నుంచి విజయం నెగ్గారు. ఢిల్లీలో జరిగిన ఉపఎన్నిక ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ విజయం సాధించింది. ఆప్ నేత రాజీవ్ చద్దా రాజ్యసభకు ఎంపిక చేయడంతో… ఆ స్థానాన్ని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకొంది. నేత దుర్గేష్ పాఠక్ రాజేంద్ర నగర్ ఉపఎన్నిక నుంచి 11 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.