అమరావతిలో ఎకరం 10 కోట్లు.. అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్
అమరావతి:
రాజధాని అభివృద్ధి కోసం నిధుల వేటలో ఏపీసీఆర్డీఏ పడింది. హైకోర్టు ఆదేశాలతో అమరావతి అభివృద్ది కోసం భూములు అమ్మాలని నిర్ణయించింది. నవులూరు,పిచ్చుకలపాలెం లో 14 ఎకరాల భూమి అమ్మకానికి ఈ నెల 6న జీవో జారీ చేసింది. తాజాగా 248.34 ఎకరాలు అమ్మడానికి CRDA రెడీ అయ్యింది. ఎకరా 10 కోట్ల చొప్పున 2480 కోట్ల రూపాయలు సేకరించాలని భవిస్తోంది. గథంలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజికి ఇచ్చిన 148 ఎకరాలను అమ్మడానికి సిద్ధం చేసిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.