సైబర్ యుద్ధంలో కూడా మనదే పైచేయి..
ఇండియా. పాక్‌పై ఆపరేషన్ సింధూర్‌లో విజయం సాధించడమే కాదు, సైబర్ దాడులను కూడా విజయవంతంగా తిప్పికొట్టింది. పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తూనే, పాక్ హ్యాకర్ల పన్నాగాన్ని కనిపెట్టింది. అనేక సైబర్ పుకార్లను, దుష్ప్రచారాలను ఆధారాలతో సహా నిరూపించింది. మన దర్యాప్తు బృందాలు గుర్తించిన సమాచరం ప్రకారం పాకిస్తాన్‌తో పాటు దాని మిత్రదేశాలు తుర్కియే, బంగ్లాదేశ్ మలోసియా, ఇండోనేసియా, ఇరాక్, చైనాకు సంబంధించిన సైబర్ దాడులు ఇండియాపై జరిగినట్లు తెలిసింది. ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ, డైనెట్, పాక్ సైబర్ ఫోర్స్, మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్ సెక్, నేషనల్ సైబర్ క్రూ వంటి గ్రూపుల పేర్లు ఈ దాడుల్లో బయటపడ్డాయి. వీటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు భారత సైబర్ వీరులు. మరోపక్క పాక్ ప్రయోగించిన వందలకొద్దీ డ్రోన్లను భారత భూభాగంలోకి రాకుండానే మట్టు బెట్టింది ఆర్మీ. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా వారియర్లు కూడా తమ శక్తి వంచన లేకుండా భారత్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. సైబర్ యోధులు కూడా డిజిటల్ చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు.