ఐపీఎల్‌లో ఆ సందడి మాయం..
భారత్, పాక్‌ల మధ్య ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. బీసీసీఐ నిర్ణయం ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి మే 17 నుండి తిరిగి నిర్వహించబడతాయి. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆకర్షణగా నిలిచే డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే ఇకపై మ్యాచ్‌లు కొనసాగుతాయని బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్‌లను డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే నిర్వహించాలనుకుంటున్నారు. దీనితో కాస్త సందడి మిస్ అవుతున్నారు అభిమానులు.