బీజేపీని తట్టుకోలేకే టీఆర్‌ఎస్-బీఆర్‌ఎస్‌గా మారింది…బండి సంజయ్
బీజేపీని తట్టుకోలేకే టీఆర్‌ఎస్-బీఆర్‌ఎస్‌గా మారిందని బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. మామూలుగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూంటాయని కానీ,తెలంగాణలో ప్రజలే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇంటెలిజన్స్ అధికారులను బదిలీ చేయకపోవడంపై ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంటే సొమ్మొకడిది..సోకొకడిది అన్నట్లు తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులపై నిఘా పెట్టాలన్నారు. కేవలం ఇతర పార్టీలకు చెందిన వారి వాహనాలపైనే ఫోకస్ చేస్తున్నారని, అధికార పార్టీ వాహనాలను తనిఖీ చేయకుండా, సీజ్ చేయకుండా వదిలేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్ సినిమాపై బీఆర్‌ఎస్ పార్టీకి భయమెందుకంటున్నారు. నిజాం రజాకార్ వారసులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రిలీజ్ కాని సినిమాకి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు.