Andhra PradeshHome Page Slider

హైకోర్టులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట

Share with

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్  కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెల రోజులు అవుతున్నప్పటికీ ఆయనకు ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఈ క్రమంలోనే ఆయనపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు,అంగళ్లు వ్యవహారంలో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన  న్యాయస్థానం..చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్ట్ చెయ్యొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు అంగళ్లు కేసులో కూడా రేపటి వరకు అరెస్ట్ చెయ్యొద్దని సీఐడీని ఆదేశించింది. కాగా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లపై హైకోర్టు స్టే విధించింది.మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.