ఇది ట్రెయిలర్ మాత్రమే..కేసీఆర్
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మేల్యేలు వరుసగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు.దీంతో తెలంగాణ రాజకీయం రోజు రోజుకి హీటేక్కుతుంది.ఇటీవల రాజగోపాల రెడ్డి రాజీనామా రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే.ఆయన కాంగ్రెస్‌ను వీడి..బీజేపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్దం ఇంకా నడుస్తూనే..ఉంది.ఇటువంటి సమయంలో మరో కాంగ్రెస్ నేత ఆ పార్టీకీ ఈ రోజు గుడ్‌బై చెప్పారు.ఆయనే దాసోజు శ్రవణ్.ఆయన ఇప్పటివరకు ఏబీవీపీ,ఆర్ఎస్ఎస్‌లలో పనిచేశారు.
అయితే ఆయన బీజేపీలో చేరుతున్నారని..త్వరలోనే ఆయన చేరిక తేదిని నిర్ణయిస్తామని తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ప్రకటించారు.రాష్ట్రంలో క్రమక్రమంగా టీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుందని ఆయన ఎద్దేవా చేశారు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు బి టీమ్‌గా ఉందని ఆయన పెర్కొన్నారు.అందువల్లనే కాంగ్రెస్ నేతలందరూ..ఒక్కొక్కరుగా పార్టీను వీడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే ఈ చేరికలు ట్రెయిలర్ మాత్రమేనని..రానున్న రోజుల్లో బీజేపీలోకి మరిన్నిచేరికలు ఉంటాయి కేసీఆర్ అని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.