మేం చెప్పిందే చేయాల్సిందే… అన్నట్టుగా కేంద్రం తీరు
మేం చెప్పిందే చేయాల్సిందే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. లేదంటే మీ కథ చూస్తామంటున్నారని విమర్శించారు. అన్ని రంగాల్లో దేశం సర్వనాశనం అయ్యిందన్నారు. కేంద్రం తీరుతో దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతోందన్నారు కేసీఆర్. ఢిల్లీలో పట్టపగలు కత్తులతో తిరుగుతున్నారన్నారు. సెస్సుల పేరుతో 13, 14 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారన్నారు. సహకార స్ఫూర్తి అంటే ఇదేనా అని ఆక్షేపించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులకు ట్విస్ట్ ఇచ్చి రాష్ట్రాల నిధులను కొల్లగొడుతున్నారన్నారు. దీన్నే సమైఖ్య స్ఫూర్తి అంటారా.. డిక్టేటరిజమ్ అంటారా అని ప్రశ్నించారు. టీమ్ ఇండియా అంటే ఇదేనా… నీతి ఆయోగ్ మీటింగ్ అంతా భజన మండలి అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రులకు సైతం ఇన్ని నిమిషాలంటూ సమయం ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. దేశంలో ముఖ్యమంత్రులే బుల్ డోజర్లు ఉపయోగిస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.