పులి పిల్లకి క్లీంకార పేరు..థాంక్స్ చెప్పిన ఉపాసన..
హైదరాబాద్: మెగా హీరో రామ్‌చరణ్, ఉపాసనల గారాలపట్టి క్లీంకార పేరును హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఒక ఆడపులికి పెట్టారు. ‘‘ఒక ఏడాది క్రితం అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ, ఈరోజు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి. దానికి మా కుమార్తె క్లీంకార పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈవిధంగా ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్ జూ బృందానికి ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవికే సొంతమైనప్పటికీ, వాటిని సంరక్షించడానికి మనం మద్దతు తెలుపుతుంటాం’’ అని ఉపాసన ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. జూ బృందానికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా క్లీంకారతో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు. ఇందులో ఉపాసన – క్లీంకార ఆ ఆడపులిని చూస్తూ కనిపించారు.