37 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకోబోతున్న స్టార్ హీరో..
విక్రాంత్ మాస్సీ ఈ పేరు కంటే కూాడా 12th fail సినిమా హీరో అంటే ఎక్కువ గుర్తుపడతారేమో. అంతలా పాపులారిటీ తెచ్చుకుందా సినిమా. అందులో నటించిన విక్రాంత్ మాస్సీ తన 37 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. హిందీ సీరియల్స్ నుంచి లూటేర సినిమాలో చిన్న పాత్ర ద్వారా బాలీవుడ్ సినీరంగ ప్రవేశం చేసారు. ఆ తర్వాత దీపికా పడుకొనే నటించిన ఛపాక్, 12th fail, ఫోరెన్సిక్, లవ్ హాస్టల్ వంటి చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే అభిమానులను సంపాదించుకున్నారు. అయితే విక్రాంత్ మాస్సీ తన 37 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్ కి గురిచేసారు.
“చాలా సంవత్సరాలుగా తనకు మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు” అని సోషల్ మీడియాలో తెలిపాడు. విక్రాంత్ తన కుటుంబం కోసం ఈ రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.