Home Page SliderNational

రాజకీయాలకు స్పీకర్ అల్విదా..

Share with

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని తెలుపుతూ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజీవాల్ కు లేఖ రాశారు. పదవిలో తనను గౌరవించి, మద్దతు తెలిపిన ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాగా 10 ఏళ్లుగా తాను శాహదారా ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్ గా తన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించానని చెప్పుకొచ్చారు. తనపై కేజ్రివాల్ చూపుతున్న గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. వయస్సు కారణంగానే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించారు.