Home Page SliderTelangana

తెలంగాణ రానున్న జేపీ నడ్డా

Share with

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 7న బీజేపీ రాష్ట్ర శాఖ కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి 3 గంటలకు సభ ఉంటుందని, ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని వెల్లడించారు.