రిటైర్మెంట్ బెనిఫిట్స్ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం
రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసి ఆరు నెలల క్రితం రిటైర్ అయిన విజయ్ కుమార్ అనే వ్యక్తికి రావాల్సిన రూ. 90 లక్షల బెనిఫిట్స్ ఇంకా అందకపోవడంపై కోర్టు విచారణ చేపట్టింది. వృద్ధాప్యంలో తమ కష్టార్జితం కోసం రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ విషయంలో కఠిన ఆదేశాలు జారీ చేస్తూ, తక్షణమే బకాయిలను విడుదల చేయాలని స్పష్టం చేసింది. విజయకుమార్‌కు రావాల్సిన పూర్తిస్థాయి పెన్షన్ ప్రయోజనాలను రాబోయే 4 వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరగకపోతే, టోకెన్ జారీ చేసిన తేదీ నుంచి 18 శాతం వార్షిక వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది.

