NationalNews

‘లాల్‌ సింగ్‌ చడ్డా’కు ఆస్కార్‌ గుర్తింపు

Share with

బాలీవుడ్‌ హీరో  ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమాకు ఆస్కార్‌ గుర్తించింది.  ఆస్కార్‌ అవార్డు పొందిన ఒరిజినల్‌ మూవీ `ఫారెస్ట్‌ గంప్‌’ ను హిందీలో తిరిగి ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్‌ను షేర్‌ చేసింది. `రాబర్ట్‌ జెమెకిస్‌, ఎరిక్‌ రోత్‌ అందించిన స్టోరీ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ స్టోరీను అద్వైత్‌ చందన్‌, అతుల్‌ కులకర్ణి భారతీయులకు నచ్చే విధంగా మార్చుకున్నారు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోలో రెండు సినిమాల సీన్స్‌లను పోల్చింది. ఒరిజినల్‌ మూవీలోని సన్నివేశాలను ఎలా పునర్నిర్మించారో కూడా క్లిప్‌ చూపించింది. అయితే, 1994లో విడుదలైన ఫారెస్ట్‌ గంప్‌ సినిమా 13 ఆస్కార్‌లకు నామినేట్‌ అయిందని కూడా వివరణ ఇచ్చింది. ఈ సినిమా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఫిల్మ్ ఎడిటింగ్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే మరియు ఉత్తమ చిత్రంగా 6 ఆస్కార్‌ అవార్డులు దక్కాయి.