Breaking NewsBusinessHome Page SliderNationalNews Alert

వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్    

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త అప్‌డేట్‌తో వచ్చింది. ఇన్-యాప్ మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేసింది. ఇకపై ప్రీపెయిడ్ వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌ల అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ చాట్ విండో నుంచే తమ మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.   ఈ సేవలను అందించడానికి వాట్సాప్ ప్రముఖ పేమెంట్ గేట్‌వే ‘పే యూ’ (PayU) తో చేతులు కలిపింది.  రిలయన్స్ జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ యూజర్లు ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.  పేమెంట్స్, రీఛార్జ్ సేవలను త్వరగా యాక్సెస్ చేసేందుకు హోమ్ స్క్రీన్‌పై ప్రత్యేకంగా రూపాయి (₹) గుర్తుతో ఒక ఐకాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా కేవలం రీఛార్జ్ మాత్రమే కాకుండా, మెట్రో టికెట్లు బుక్ చేసుకోవడం, కరెంట్ బిల్లులు చెల్లించడం వంటి పనులు కూడా పూర్తి చేయవచ్చు.