తిరుమలలో ఏపీ మంత్రి అప్పలరాజు ఓవర్‌ఏక్షన్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు తరచుగా అధికారదర్పం ప్రదర్శించి వార్తలకెక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్లలో సిదిరి అప్పలరాజు ఒకరు. ఈయన “రాజు వెడలె రవితేజములలరగ” అన్నట్లుగా తన 140 మంది అనుచరులతో సహా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తనతో పాటు తన అనుచరులందరికీ ప్రొటోకాల్ వీఐపీ దర్శనం కల్పించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి చేసారు. మంత్రి ఒత్తిడికి టీటీడీ తలవొగ్గాల్సి వచ్చింది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో హల్‌చల్ చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ఉల్లంఘనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను నిబంధనలు అతిక్రమించలేదని సామాన్యవ్యక్తులాగే అనుచరులతో దర్శనం చేసుకున్నానని వివరణ ఇచ్చారు మంత్రి. ఈయన జగన్ సర్కారులో రెండవసారి మంత్రిగా కొనసాగుతున్నారు.
Read more: ఐరోపా చమురు సంక్షోభంలో అమెరికా జోక్యం