ఆస్కార్‌లో ‘లాపతా లేడీస్’ పేరు మార్పు
భారతీయ చిత్రం ‘లాపతా లేడీస్’ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆస్కార్ క్యాంపెయిన్ సందర్భంగా అందరికీ అర్థమయ్యేలా ‘లాస్ట్ లేడీస్’ అని పేరు మార్చింది చిత్ర బృందం. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఆయన మాజీ సతీమణి కిరణ్ రావులు నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2001 నాటి గ్రామీణ ప్రాంతంలోని నవ వధువుల రైలు ప్రయాణం ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు పెళ్లి కూతుర్లు ముఖానికి వేసుకున్న ముసుగు కారణంగా తారుమారవడం ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి న్యూయర్క్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో అమిర్ ఖాన్, కిరణ్ రావులు పాల్గొన్నారు. అమిర్ ఖాన్ మాట్లాడుతూ 2002లో తాను నటించిన ‘లగాన్’ చిత్రం ఆస్కార్‌కు ఎంపికయ్యిందని, ఇప్పుడు తాను నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.