పట్నం అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్. ఈ అరెస్టును నిరసిస్తూ ట్వీట్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆపాదిస్తున్నారంటూ విమర్శించారు. ప్రజల తిరుగుబాటును రేవంత్ రెడ్డి అణచివేసే ప్రయత్నం చేయడం వల్లే లగచర్లలో ఆందోళనలు జరిగాయన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే నరేందర్ రెడ్డిని, రైతులను విడుదల చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఒకపక్క తెలంగాణలో అలర్లు జరుగుతున్నాయి. రైతులను, ఎమ్మెల్యేలను జైలులో పెడితే మంత్రులు లండన్‌కు ప్రయాణం కట్టారని, వారి వీడియోను షేర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికలలో బిజీగా ఉన్నారని విమర్శించారు.