రంగారెడ్డిని చిత్తు చేసిన కరీంనగర్
తెలంగాణ టీజీ20 లీగ్- 2026 ఎలిమినేటర్‌లో కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌ను ఓడించి క్వాలిఫైయర్ -2కు చేరుకుంది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 61 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 137 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టీజీ20 లీగ్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. సింహా 50 పరుగులతో రాణించగా, వీరిద్దరూ రెండో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ 16.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ (63), నితిన్ సాయి యాదవ్ (50) అర్ధ సెంచరీలు చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
కరీంనగర్ బౌలర్లలో ఆశిష్ శ్రీవాస్తవ 5 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పగా, శుభమ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. క్వాలిఫైయర్ -2లో కరీంనగర్ డైమండ్స్, హైదరాబాద్ ఈ- ఛాంపియన్స్- ఖమ్మం ఏస్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో తలపడనుంది.

