Home Page SliderInternationalNewsSports

ఒక్క రోజులోనే ఐదు పతకాలు పట్టిన భారత్..

వియత్నంలో జరుగుతున్న అండర్ -23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత యువ రెజ్లర్లు సత్తాచాటారు. గురువారం ఒక్క రోజే ఐదు బంగారు పతకాలు దక్కాయి. ఉమెన్స్ రెజ్లింగ్ లో 50 కేజీల కేటగిరీలో ప్రియాన్షి ప్రజాపత్ చాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో మంగోలియా బాక్సర్ ముంఖ్ భట్ 4-2తో ఓడించింది. 55 కేజీల కేటగిరీలో రీనా 13-4 తేడాతో అరుకె కాడిర్బెకన్ ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. 68 కేజీల కేటగిరీలో శ్రిష్టి కూడా బంగారు పతకం గెలిచింది. ఫైనల్లో ఆమె 10-0తో చైనా రెజ్లర్ యుకీ లియుపై ఏకపక్ష విజయం సాధించింది. 76 కేజీల కేటగిరీలో ప్రియా కూడా స్వర్ణం గెలవగా.. 59 కేజీల కేటగిరీలో తన్వి గుండేశ్ రజతం సాధించింది. గ్రీకో రోమన్ విభాగంలో 63 కేజీల కేటగిరీలో సుమిత్ గోల్డ్ మెడల్ గెలిచాడు. బుధవారం గ్రీకో రోమన్ కేటగిరీలో అంకిత్ గులియా(72 కేజీలు), నితేశ్ సివాచ్(97 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు.