చైనాను అధిగమించనున్న భారత్…800 కోట్లకు చేరువైన ప్రపంచ జనాభా
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా రెండవ స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించనుంది.జూలై 11 న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి తమ జనాభా అంచనాల నివేదిక ద్వారా వెల్లడించింది.ఈ ఏడాది మార్చి 4 వ తేది నాటికి చైనా జనాభా 1.412 బిలియన్లు ఉండగా భారత్ జనాభా 1.415 బిలియన్లుగా ఉందని పేర్కొంది.ఈ గణాంకాల ప్రకారం చూస్తే భారత్ ఇప్పటికే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే మరోవైపు ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబరు నాటికి 800 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది.అయితే ప్రపంచ జనాభా 1987లో 500 కోట్లు ఉండగా 2006లో 600 కోట్లుగా ఉండి దాదాపు 4 సంవత్సరాల వ్యవధిలోనే అంటే 2011 లోనే 700 కోట్లకు చేరుకుంది. మళ్ళీ ఇప్పుడు అనగా 2022 నాటికి 800 కోట్లకు చేరుకోనుంది అని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.అలానే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచజనాభా 84 లక్షలు పెరుగుతున్నారని తెలిపింది.ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచజనాభా 860 కోట్లు ,2050 నాటికి 980 కోట్లు మరియు 2100 నాటికి 1160 కోట్లకు చేరుకుంటుంది అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2022 ముఖ్య ఉద్దేశ్యం ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశ్యం ” మనది 800 వందల కోట్ల ప్రపంచం ….అందరికీ స్థిరమైన భవిష్యత్తు కోసం అవకాశాలను సరిగ్గా ఉపయోగించడం .అలాగే అందరికీ హక్కులు ,అందరి సరైన ఎంపికలను నిర్ధారించడం” వంటివి ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశ్యాలు గా ఉన్నాయి.ప్రపంచ జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం ఒక ముఖ్యమైన వేడుక.ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది.అధిక జనాభా వలన పర్యావరణం ,అభివృద్దిపై కలిగే ప్రభావాన్ని తెలియజేస్తుంది.స్రీలు ఎదుర్కొటున్న ఆరోగ్య సమస్యలు ,కుటుంబ నియంత్రణ ,లింగ సమానత్వం ,పేదరికం ,మానవ హక్కుల ప్రాముఖ్యత ఇలా అనేక అంశాలపై ఈ రోజు చర్చ జరిపేందుకు అవకాశం కల్పిస్తుంది.