Telangana

కేసీఆర్ కాదు….దుబాయి శేఖర్ అని పిలవండి

Share with

ప్రజల్లోకి పోలేకనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి గంటల కొద్దీ మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ సభ రెస్పాన్స్ చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని విమర్శించారు. పీఎం మోడీపై కూడా కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా,అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు పాస్ పోర్ట్ బ్రోకర్ గా ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు చెట్టుకు కట్టేసి కొట్టారని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడన్నారు. ఇక నుంచి ఆయనను కేసీఆర్ అని కాకుండా దుబాయి శేఖర్ అని పిలువాలని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌పై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని,ప్రతి సర్వే టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా వస్తోందన్నారు. కొంగరకలన్ సభకి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రాలెేదని, బిర్యానీ పెట్టి ,డబ్బులు ఇచ్చిన జనం వస్తలేరన్నారు. కేసీఆర్‌కు పోయే కాలం దగ్గరపడిందని, అందుకే సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష చూసిన తర్వాత, సీఎం అనడానికి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలంటే జనాలకు అసహ్యం కలుగుతోందని ఆక్షేపించారు. కేసీఆర్ సీఎం కాదని పాస్‌పోర్ట్ బ్రోకర్ అరుణ ఆరోపించారు. జోగులంబకి 100 కోట్లు అంటివి, ఏమి అయ్యిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు ఇచ్చే అమ్మ ని అవమానిస్తావా? ఆ తల్లి ఆశీస్సులతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిన విషయాన్ని మరచిపోయావా అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో డేట్ చెప్పి ముందస్తు ఎన్నికలకు పోయావా ఇప్పుడు బీజేపీ ప్రస్తావన ఎందుకు ,ఎప్పుడైనా బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని డీకే అరుణ కేసీఆర్ పై ఫైరయ్యారు.