ఎన్టీఆర్‌కు హృతిక్ సర్‌ప్రైజ్..
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో హృతిక్ ఒక భారీ సర్‌ప్రైజ్ అనౌన్స్ చేశాడు. “తారక్ నీ పుట్టినరోజున నువ్వు ఊహించని గిఫ్ట్..” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘వార్ 2’ నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ పుట్టిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. అదే రోజు ‘దేవర 2’, ‘డ్రాగన్’ మూవీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.