నా మాజీ భార్య నిలువెల్లా దోచేసింది..
తన మాజీ భార్య నిలువెల్లా దోచేసిందని ఆవేదన చెంది సంచలన లేఖ విడుదల చేశాడు తమిళ స్టార్ హీరో జయం రవి. తన ఆడంబరాల కోసం తన మాజీ భార్య, ఆమె కుటుంబం తనకు ఆర్థికంగా దోచుకున్నారంటూ ఆవేదన చెందాడు. తనను షూరిటీగా పెట్టి కోట్లాది రూపాయలు అప్పుచేసి నడిరోడ్డుకు లాగేశారని ఆరోపణ చేశాడు. కనీసం కన్న బిడ్డలను కూడా చూడనివ్వడం లేదని జయం రవి వాపోయాడు. మానసికంగా, శారీరకంగా అలిసిపోయానని.. ఈ సమయంలో తన జీవితంలో ఓ వెలుగులా కేనీషా వచ్చిందన్నాడు స్టార్ హీరో. ఎన్నో బాధలు భరించాను.. ఇక ఓపిక లేదంటూ లేఖలో పేర్కొన్నాడు జయం రవి.